జయసుధ, అలీలను ప్రశ్నించారు... రాఘవేంద్రరావు సంగతేంటి చంద్రబాబూ?: విజయసాయిరెడ్డి

  • తిత్లీ బాధితులను జయసుధ, అలీ పరామర్శించలేదన్న చంద్రబాబు
  • రాఘవేంద్రరావు పరామర్శించారా?
  • ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి ప్రశ్న
ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జయసుధ, అలీ తదితరులు తిత్లీ తుఫాను సమయంలో బాధితులను కనీసం పరామర్శించేందుకు కూడా రాలేదని చంద్రబాబునాయుడు విమర్శించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి తప్పుబట్టారు.

 ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "జయసుధ, ఆలీ వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఎలా చేరతారు? తిత్లీ తుఫాన్ వచ్చినపుడు వాళ్లిద్దరు ఎక్కడికెళ్లారని ప్రశ్నిస్తున్నారంటే మీకు నిజంగా ఏదో అయినట్లే ఉంది చంద్రబాబూ? వంద కోట్ల టిటిడి నిధులను దోచిపెట్టిన కె.రాఘవేంద్రరావు, బి.ఎ, బాధితులను పరామర్శించాడా? కేజ్రీవాల్, మాయావతి,మమతలు ఓదార్చారా?" అని ప్రశ్నించారు.



Go Back to Shorts
Raghavendra rao
Vijayasai Reddy
Jayasudha
Ali

More Telugu News